Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 18

Moksha Sanyasa Yoga

मोक्षसंन्यासयोगः

Chapter 18 of 18 78 verses
← Previous Next →
Verse 1 Open →
अर्जुन उवाच |
संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् |
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन
అర్జున ఉవాచ|
సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన|| 18-1 ||
అర్జునుడన్నాడు:ఓ హృషీకేశా! కేశి సంహారా! సన్యాసం యొక్క తత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలని కోరుతున్నాను.
Verse 2 Open →
श्रीभगवानुवाच |
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः |
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः
శ్రీభగవానువాచ|
కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః|
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః|| 18-2 ||
శ్రీ భగవానుడన్నాడు :కామ్య కర్మలని వదిలి పెట్టడం సన్యాసమని ఋషులంటారు. అన్ని కర్మల ఫలాన్ని త్యజించడం త్యాగమని వివేకులు అంటారు.
Verse 3 Open →
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः |
यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః|
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే|| 18-3 ||
దోషం కల కర్మలని వదలాలని కొందరు పండితులంటారు. యజ్ఞ దాన తపః కర్మలని వదలరాదని కొందరు అంటారు.
Verse 4 Open →
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम |
त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ|
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సమ్ప్రకీర్తితః|| 18-4 ||
భరత శ్రేష్టుడా! ఈ విషయంలో నా నిర్ణయాన్ని విను. పురుష వ్యాఘ్రమా! త్యాగం మూడు విధాలని చెప్ప బడుతుంది.
Verse 5 Open →
यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् |
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్|
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్|| 18-5 ||
యజ్ఞ దాన తపః కర్మలను మానరాదు. చేయవలసినదే. వివేకులను శుద్ధం చేసేది యజ్ఞ దాన తపస్సులే.
Verse 6 Open →
एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च |
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्
ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్త్వా ఫలాని చ|
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్|| 18-6 ||
అర్జునా! ఈ కర్మలను కూడా సంగాన్ని, ఫలాన్ని వదిలి చెయ్యాలని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం.
Verse 7 Open →
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते |
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः
నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే|
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః|| 18-7 ||
నియత కర్మలను సన్యసించకూడదు. భ్రాంతితో వానిని సన్యసించడం తామసిక త్యాగం అనిపించుకుంటుంది.
Verse 8 Open →
दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् |
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్|
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్|| 18-8 ||
శరీరానికి కష్టం కలుగుతుందనే భయంతోనూ, బాధాకరమని కర్మని వదిలేస్తే అది రాజసిక త్యాగం అవుతుంది. దానివలన త్యాగఫలం లభించదు.
Verse 9 Open →
कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन |
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేऽర్జున|
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః|| 18-9 ||
కర్తవ్య బుద్ధితో సంగభావం, ఫలాపేక్ష వదిలి నియత కర్మని చేసినపుడు అది సాత్విక త్యాగం అవుతుందని నా అభిప్రాయం.
Verse 10 Open →
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते |
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే|
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః|| 18-10 ||
సత్వగుణంతో నిండిన మేధావి సంశయ రహితుడై ప్రతికూల కర్మని ద్వేషించడు.
Verse 11 Open →
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः |
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః|
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే|| 18-11 ||
దేహధారికి కర్మలన్నింటిని త్యజించడం సాధ్యం కాదు. కర్మ ఫలాన్ని త్యజించిన వాడే త్యాగి అనిపించుకుంటాడు.
Verse 12 Open →
अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् |
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित्
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్|| 18-12 ||
కర్మ ఫలం దుష్టమైనవి, మంచివి, మిశ్రమమైనవి అని మూడు విధాలైన కర్మ ఫలాలు త్యాగులు కాని వారికి మరనణానంతరం లనభిస్తాయి. అవి సన్యాసులకి కొంచం కూడా రాదు.
Verse 13 Open →
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे |
साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्
పఞ్చైతాని మహాబాహో కారణాని నిబోధ మే|
సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్|| 18-13 ||
ఓ మహానుభావా సాంఖ్య సిద్ధాంతంలో ఏ కర్మలైనా సరే సిద్ధించడానికి ఈఅయిదు కారణాలు కావాలని చెప్ప బడినాయి. వాటిని గురించి విను.
Verse 14 Open →
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम्
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్|
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పఞ్చమమ్|| 18-14 ||
అధిష్టానమైన శరీరం, కర్మ చేసే వాడు, వేర్వేరు ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రారబ్ధం ఈ అయిదూ(సర్వ కర్మ సిద్ధికి కారణాలు)
Verse 15 Open →
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः |
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः
శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః|
న్యాయ్యం వా విపరీతం వా పఞ్చైతే తస్య హేతవః|| 18-15 ||
మంచిది కాని, చెడ్డది కాని మానవుడు మనో వాక్కాయములతో ఏ కర్మ చేసినా దానికి ఈ అయిదు కారణమౌతాయి
Verse 16 Open →
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः |
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः
తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః|
పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః|| 18-16 ||
విషయం ఇలా ఉండగా, అపరిపక్వమైన బుద్ధితో కేవలం తానే కర్తననుకునే మూర్ఖుడు తెలివి తక్కువ తనం వలన సరిగా గ్రహించడు.
Verse 17 Open →
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते |
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే|
హత్వాऽపి స ఇమాఁల్లోకాన్న హన్తి న నిబధ్యతే|| 18-17 ||
ఎవరిలో అహంకారం లేదో, ఎవరి బుద్ధి కర్మలో తగుల్కోదో, అతడు ఈ లోకులను చంపినా, చంపినవాడు కాదు. బంధనంలో చిక్కుకోడు.
Verse 18 Open →
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना |
करणं कर्म कर्तेति त्रिविधः कर्मसंग्रहः
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా|
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః|| 18-18 ||
జ్ఞానమూ, తెలుసుకోవలసిన విషయమూ, తెలుసుకునే వాడూ, ఈ మూడూ కర్మని ప్రేరేపించేవి. ఇంద్రియం, కర్మ, కర్మ చేసినవాడు, ఈ మూడూ కర్మని నిర్వహించేవి.
Verse 19 Open →
ज्ञानं कर्म च कर्ताच त्रिधैव गुणभेदतः |
प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणु तान्यपि
జ్ఞానం కర్మ చ కర్తాచ త్రిధైవ గుణభేదతః|
ప్రోచ్యతే గుణసఙ్ఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి|| 18-19 ||
జ్ఞానం, కర్మ, కర్త-ఈ మూడూ గుణ భేధాలని బట్టి మూడేసి విధాలని, గుణాలకు సంబంధించిన సౌఖ్యంలో చెప్పబడినది. అందులో ఉన్నదానిని విను.
Verse 20 Open →
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते |
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम्
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే|
అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్|| 18-20 ||
అన్ని ప్రాణులలోనూ నాశనం లేని ఒకే సత్తు ఉన్నదనీ, భిన్నమైన వాటిలో అది అవిభక్తంగా ఉన్నదనీ గ్రహించేది సాత్విక జ్ఞానమని తెలుసుకో.
Verse 21 Open →
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् |
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम्
పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్|
వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్|| 18-21 ||
వేరు వేరు కనబడే రూపాలలో వేరువేరు జీవుళ్ళు ఉన్నారని గ్రహించేది రాజసిక జ్ఞానమని తెలుసుకో.
Verse 22 Open →
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् |
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम्
యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్|
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్|| 18-22 ||
ఒక వస్తువే సర్వమూ అని, యుక్తికి విరుద్ధంగా, అసంబద్ధంగా, అల్పత్వంతో పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమని అనబడుతుంది.
Verse 23 Open →
नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् |
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते
నియతం సఙ్గరహితమరాగద్వేషతః కృతమ్|
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే|| 18-23 ||
సంగభావం లేక, ఫలం మీద ఆశ లేక, రాగ ద్వేషాలు లేక చేసిన నిత్య కర్మ సాత్విక కర్మ.
Verse 24 Open →
यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः |
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః|
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్|| 18-24 ||
కోరికతో అహంకారంతో బహు శ్రమతో చేసే కర్మ రాజసిక కర్మ.
Verse 25 Open →
अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् |
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते
అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్|
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే|| 18-25 ||
బంధనంలో ఇరికించేది, నాశనాన్ని హింసని కలుగచేసేది శక్తి సామర్ధ్యాలు లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినదీ అయిన కర్మ తామసిక కర్మ అని చెప్ప బడుతుంది.
Verse 26 Open →
मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः |
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते
ముక్తసఙ్గోऽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః|
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే|| 18-26 ||
సంగభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేని వాడు, పట్టుదల ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వలన చలించని వాడు అయిన కర్త సాత్వికుడని చెప్పబడతాడు.
Verse 27 Open →
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः |
हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः
రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోऽశుచిః|
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః|| 18-27 ||
రాగంతో కూడి ఫలం కోరుతూ, పిసినిగొట్టు తనమూ, హింసా స్వభావం కలిగి, అశుచి అయి, సుఖదుఃఖాలకు లోనయ్యే కర్త --రాజసికుడని చెప్ప బడుతుంది.
Verse 28 Open →
अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः |
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోऽలసః|
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే|| 18-28 ||
ఎలాటి నిగ్రహం లేని వాడు, పామరుడు, సంకుచిత స్వభావం కలవాడు, మొండివాడు, మోసగాడు బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతి దానికి కాలయాపన చేసే కర్త, తామసికుడని చెప్ప బడతాడు.
Verse 29 Open →
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु |
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు|
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ|| 18-29 ||
ధనంజయా! గుణాలనిబట్టి మూడేసి విధాలుగా ఉండే బుద్ధినీ, ధృతినీ గురించి వేరువేరుగా, పూర్తిగా చెబుతాను విను.
Verse 30 Open →
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये |
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే|
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ|| 18-30 ||
అర్జునా! ప్రవృత్తి-నివృత్తులు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధ మోక్షాలు---వీటిని వివరంగా చెబుతాను విను.
Verse 31 Open →
यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च |
अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ|
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ|| 18-31 ||
పార్ధా! ధర్మాధర్మాలని, కార్యాకార్యాలని సరిగా నిర్ణయించ లేని బుద్ధి రాజసికమైనది.
Verse 32 Open →
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता |
सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా|
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ|| 18-32 ||
అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా, అన్ని విషయాలను విపరీతంగా ఎంచే బుద్ధి తామసిక మైనది.
Verse 33 Open →
धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः |
योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేన్ద్రియక్రియాః|
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ|| 18-33 ||
చలించని యోగంలో మనస్సు, ప్రాణ, ఇంద్రియాల చేష్టలను నిగ్రహించి ఉంచే ధృతి సాత్విక మైనది.
Verse 34 Open →
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन |
प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी
యయా తు ధర్మకామార్థాన్ధృత్యా ధారయతేऽర్జున|
ప్రసఙ్గేన ఫలాకాఙ్క్షీ ధృతిః సా పార్థ రాజసీ|| 18-34 ||
అర్జునా! ఏ పట్టుదల ధర్మ కామార్ధాలనే లౌకిక పురుషార్ధాలని మమకారంతో, ఫలాశతో నిలబెట్టి ఉంచుతుందో అది రాజసిక ధృతి.
Verse 35 Open →
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च |
न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ|
న విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ|| 18-35 ||
పార్ధా! మూర్ఖుడు ఏ ధృతితో స్వప్నాలనీ, భయాన్నీ, శోకాన్నీ, విషాదాన్నీ, మదాన్నీ వదలకుండా పట్టుకుంటాడో అది తామసికము అయిన పట్టుదల.
Verse 36 Open →
सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ |
अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ|
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి|| 18-36 ||
భరతశ్రేష్టుడా! అభ్యాసం వలన దేనిలో మానవుడు దుఃఖాన్ని అంతమొందించి సుఖపడ కలుగుతాడో ఆ మూడు విధాలైన సుఖాలని గురించి విను.
Verse 37 Open →
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् |
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम्
యత్తదగ్రే విషమివ పరిణామేऽమృతోపమమ్|
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్|| 18-37 ||
ఏ సుఖమైతే మొదట విషంగా తోచి, చివరకు ఏది అమృతమౌతుందో, ఏది శాంతించిన బుద్ధి వలన లభిస్తుందో అది సాత్విక సుఖం.
Verse 38 Open →
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् |
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्
విషయేన్ద్రియసంయోగాద్యత్తదగ్రేऽమృతోపమమ్|
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్|| 18-38 ||
విషయాలు ఇంద్రియాలు సంయోగం వలన మొదట అమృతప్రాయంగా ఉండి, చివరికి విషంలా తయారయ్యేది రాజసిక సుఖం.
Verse 39 Open →
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः |
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम्
యదగ్రే చానుబన్ధే చ సుఖం మోహనమాత్మనః|
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్|| 18-39 ||
పరంతపా! బ్రాహ్మణ , క్షత్రియ, వైశ్య, శూద్రుల కర్మలు వాళ్ళ స్వభావం నుండి జనించిన లక్షణలను బట్టి విభజింప పడినాయి.
Verse 40 Open →
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः |
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః|
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః|| 18-40 ||
నిద్ర, బద్ధకం, ఏమరుపాటుల నుండి జనించి ముందు నుండి చివరకు భ్రాంతిలో పడేసి ఉంచే సుఖం తామసికం.
Verse 41 Open →
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप |
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరన్తప|
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః|| 18-41 ||
భూమిపైనగాని, స్వర్గంలోని దేవతలలో కాని ప్రకృతి వలన పుట్టిన ఈ మూడు గుణాల నుండి విడిపడి ఉన్నప్రాణి ఏదీ లేదు.
Verse 42 Open →
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च |
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम्
శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ|
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్|| 18-42 ||
శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్మి, ఋజుత్వము, జ్ఞాన విజ్ఞానాలు, ఆస్థిక భావము---ఇవి బ్రాహ్మణులకు స్వభావ సిద్ధమైన కర్మలు.
Verse 43 Open →
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् |
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్|
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్|| 18-43 ||
శౌర్యం, తేజం, పట్టుదల, సమర్ధత, యుద్ధంలో వెన్ను చూపక పోవడం, దానగుణం, ఈశ్వర లక్షణం---ఇవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు.
Verse 44 Open →
कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् |
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम्
కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్|
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్|| 18-44 ||
వ్యవసాయం, గోసంరక్షణ, వాణిజ్యం స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు. పరిచర్య భావంతో కూడినవి శూద్రులకు స్వభావ సిద్ధమైన కర్మలు.
Verse 45 Open →
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः |
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః|
స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణు|| 18-45 ||
తన తన కర్మలలోనిమజ్ఞుడైన మానవుడు , తన కర్మలో నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడో చెబుతాను విను.
Verse 46 Open →
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् |
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్|
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః|| 18-46 ||
ఎవరినుండి జీవుళ్ళు పుట్టుకొస్తారో, ఎవరి వలన ఇది యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆయన్ని తన కర్మ చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు.
Verse 47 Open →
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్|| 18-47 ||
బాగా అనుష్టించిన పరధర్మంకన్నా, హీనమైన స్వధర్మం మేలు. స్వభావం చేత ప్రేరేపించబడిన కర్మని చేయడం వలన పాపాన్ని పొందడు. హీనమైన అనగా చెడు అని అర్తమా?
Verse 48 Open →
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् |
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः
సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్|
సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః|| 18-48 ||
కౌంతేయా! సహజమైన కర్మ దోషంతో కూడినను వదలరాదు. పొగ చేత కప్పబడిన అగ్ని లాగా అన్ని కర్మలూ దోషంతోనే మొదలౌతాయి.
Verse 49 Open →
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः |
नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति
అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః|
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్ఛతి|| 18-49 ||
సర్వత్రా దేనికీ తగుల్కొనని బుద్ధితో, మనస్సుని జయించి, కోరికలలు వదిలి సన్యసించడం ద్వారా కర్మల నుండి విడుదల పొందే ఉత్తమోత్తమమైన స్థితిని పొందుతాడు.
Verse 50 Open →
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे |
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే|
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా|| 18-50 ||
నైష్కర్మ్య సిద్ధిని పొందిన వాడు బ్రహ్మ పదార్ధాన్ని ఎలా చేరుకుంటాడో క్లుపంగా చెబుతాను విను. అర్జునా ఇది పరమమైన జ్ఞానాభ్యాసం.
Verse 51 Open →
बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च |
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ|
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ|| 18-51 ||
విశుద్ధమైన బుద్ధితో కూడుకొని, పట్టుదలతో మనస్సుని నియమించి, శబ్ధాది విషయాలని త్యజించి, రాగద్వేషాలను వదిలి,
Verse 52 Open →
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः |
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః|
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః|| 18-52 ||
ఏకాంత ప్రదేశంలో వసిస్తూ, ఆహారాన్ని స్వల్పంగా మాత్రమే స్వీకరిస్తూ, మనోవాక్కాయాలను నియత్రిస్తూ, నిత్యమూ ధ్యాన యోగంలో నిమజ్ఞుడై వైరాగ్యంలో నిలిచి,
Verse 53 Open →
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् |
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్|
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే|| 18-53 ||
అహంకారాన్ని, బల దర్పాన్ని, కామ క్రోధాలను, పరిగ్రహ బుద్ధిని వదిలి, మమకారాన్ని త్యజించి, శాంతుడై బ్రహ్మ స్వరూపుడు అవడానికి అర్హుడౌతాడు.
Verse 54 Open →
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति |
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాఙ్క్షతి|
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్|| 18-54 ||
బ్రహ్మ భూతుడై ప్రసన్న చిత్తుడైన వాడు దేనికీ శోకించడు. దేనినీ కోరడు. ప్రాణులందరి యందు సమభావం కలిగి నాయందు పరమ భక్తిని పొందుతాడు.
Verse 55 Open →
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः |
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః|
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్|| 18-55 ||
భక్తి ద్వారా నేనెవరినో, ఎలాంటి వాడినో నా పూర్తి తత్వాన్ని గుర్తెరుగుతాడు. నా తత్వాన్ని గ్రహించినందు వలన తరవాత నాలోనే ప్రవేసిస్తాడు.
Verse 56 Open →
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः |
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః|
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్|| 18-56 ||
అన్ని కర్మలను సదా చేస్తూనే, నన్ను శరణు పొందిన వాడు నా అనుగ్రహం వలన శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని పొందుతాడు.
Verse 57 Open →
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः |
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव
చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః|
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ|| 18-57 ||
(అర్జునా)మానసికంగా కర్మలన్నింటినీ నాకు సమర్పించి నన్నే గమ్యంగా పెట్టుకొని జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి నన్ను నీ చిత్తంలో నిలుపుకో.
Verse 58 Open →
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि |
अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి|
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి|| 18-58 ||
మనస్సు నాలో ఉంచితే నా అనుగ్రహం వలన అన్ని అడ్డంకులనూ దాటుతావు. అహమ్కారం వలన వినక పోయావా నశిస్తావు.
Verse 59 Open →
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे |
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति
యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే|
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి|| 18-59 ||
అహంకారంతో యుద్ధం చేయనని నిర్ణయించుకున్నా, నీ యీ ప్రయత్నం దండుగ అవుతుంది. నీ స్వభావమే నిన్ను యుద్ధంలో నియోగిస్తుంది.
Verse 60 Open →
स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा |
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोपि तत्
స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా|
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశోపి తత్|| 18-60 ||
అర్జునా! నీ స్వభావ సిద్ధమైన కర్మలకు నీవు బద్ధుడివి. భ్రంతి వలన కర్మ చేయడానికి ఇష్ట పడకపోయినా తప్పని సరిగా చేసి తీరుతావు.
Verse 61 Open →
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति |
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్ఠతి|
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా|| 18-61 ||
అర్జునా! ఈశ్వరుడు ప్రాణులందరి హృదయాలలోను కూర్చుని, యంత్రం ఉన్న(బొమ్మల వలె)జీవుళ్ళని మాయచేత త్రిప్పుతూ ఉన్నాడు.
Verse 62 Open →
तमेव शरणं गच्छ सर्वभावेन भारत |
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత|
తత్ప్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్|| 18-62 ||
అన్ని విధాల ఆయన్నేశరణు పొందు. ఆయన అనుగ్రహం వలన పరమ శాంతిని శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు.
Verse 63 Open →
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया |
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ||६३||
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా|
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు|| 18-63 ||
ఈ వధంగా నీకు అతి రహస్యమైన జ్ఞానం చెప్పాను. దానిని క్షున్నంగా విమర్శించి తెలుసుకొని, నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి.
Verse 64 Open →
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः |
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః|
ఇష్టోऽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్|| 18-64 ||
అన్నిటికన్నా ఎక్కువైన రహస్యాన్ని మళ్ళీ నాపరమ వాక్కు ద్వారా విను. నాకు చాలా ఇష్టమైన వాడివని నీ హితంకోరి చెబుతున్నాను.
Verse 65 Open →
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु |
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోऽసి మే|| 18-65 ||
మనస్సు నాలో ఉంచు, నా భక్తుడివికా నన్ను ఆరాధించు. నాకు నమస్కరించు నన్నే పొందుతావూ. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.
Verse 66 Open →
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ||६६||
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః|| 18-66 ||
అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే శరణూ పొందు. అన్ని పాపాలనుండి నీకు నేను మోక్షమిస్తాను. విచారించకు.
Verse 67 Open →
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन |
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన|
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి|| 18-67 ||
ఈ జ్ఞానాన్ని తపస్సు చేయని వానికి, భక్తుడు కాని వానికి, నన్ను ద్వేషించే వానికీ , ఏ సందర్భంలోనూ చెప్ప కూడదు.
Verse 68 Open →
य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति |
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः
య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి|
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః|| 18-68 ||
పరమ రహస్యమైన ఈ జ్ఞానాన్ని నా భక్తులకు చెప్పిన వాడు , నాలో పరమమైన భక్తిని పొంది నన్నే చేరతాడు. ఇందులో అనుమానము లేదు.
Verse 69 Open →
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः |
भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః|
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి|| 18-69 ||
మనుష్యులందరిలో అతడికన్నా నాకు ప్రియమైన పని చేసేవాళ్ళు లేరు, అతడికన్నా నాకు బాగా ఇష్టులుండరు.
Verse 70 Open →
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः |
ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః|
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః|| 18-70 ||
ధార్మికమైన మన ఈ సంవాదాన్ని జ్ఞాన యజ్ఞంద్వారా ఎవరు అధ్యయనం చేస్తారో వారికి దాని వలన నేను ఇష్టుడిని ఔతాను.
Verse 71 Open →
श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः |
सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम्
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః|
సోऽపి ముక్తః శుభాఁల్లోకాన్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్|| 18-71 ||
అసూయ లేకుండా శ్రద్ధతో (ఈ గీతను)వినినప్పటికీ ఆ మానవుడు ముక్తుడై పుణ్యాత్ములకు లభించే శుభలోకాలని పొందుతాడు.
Verse 72 Open →
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा |
कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనఞ్జయ|| 18-72 ||
అర్జునా! నా ఈ మాతటలను(గీత)ఏకాగ్ర చిత్తంతో విన్నావా?ధనంజయా! నీ అజ్ఞానం నశించిందా.
Verse 73 Open →
नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत |
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ||७३||
అర్జున ఉవాచ|
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత|
స్థితోऽస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ|| 18-73 ||
అర్జునుడన్నాడు:అచ్యుతా! నీ అనుగ్రహం వలన నాకు మోహం నశించింది. స్మృతి లభించింది. సందేహాలు తీరాయి. నీవు చెప్పినట్లు చేస్తాను.
Verse 74 Open →
सञ्जय उवाच |
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः |
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम्
సఞ్జయ ఉవాచ|
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః|
సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్|| 18-74 ||
సంజయుడు ఇలా పలికాడు:- ఇలా వాసుదేవునికీ, మహాత్ముడైన అర్జునుడికీ మధ్య, పులకరింతలు పుట్టించే విధంగా జరిగిన అద్భుతమైన సంవాదాన్ని నేను విన్నాను.
Verse 75 Open →
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् |
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम्
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్|
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతః స్వయమ్|| 18-75 ||
పరమ రహస్యమైన ఈ యోగాన్ని, సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడే స్వయంగా చెబుతూ ఉండగా వ్యాస మహర్షి అనుగ్రహం వలన నేను వినగలిగాను.
Verse 76 Open →
राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् |
केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः
రాజన్సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్|
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః|| 18-76 ||
రాజా! కృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదాన్ని తలచుకొని తలచుకొని క్షణ క్షణం ఆనందంతో పొంగిపోతున్నాను.
Verse 77 Open →
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः |
विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః|
విస్మయో మే మహాన్ రాజన్హృష్యామి చ పునః పునః|| 18-77 ||
రాజా హరియొక్క ఆ అద్భుతమైన రూపాన్ని తలచుకొని తలచుకొని నాకు అమితమైన విస్మయం కలుగుతోంది. మళ్ళీమళ్ళీ ఆనందం కలుగుతుంది.
Verse 78 Open →
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः |
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ||७८||
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ|| 18-78 ||
యోగేశ్వరుడైన కృష్ణుడూ ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ, సంపద, గొప్పతనం, విజయం, స్థిరమైన నీతి ఉంటాయని నానిశ్చయం.