अर्जुन उवाच |
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः |
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः
అర్జున ఉవాచ|
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః|| 17-1 ||
అర్జునుడన్నాడు:కృష్ణా! ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది?సాత్వికమా, రాజసికమా, తామసికమా?
श्रीभगवानुवाच |
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा |
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु
శ్రీభగవానువాచ|
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు|| 17-2 ||
శ్రీ భగవానుడన్నాడు:మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా ఉంటుంది. అది స్వభావం నుండి జనిస్తుంది. వాటిని గురించి విను.
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత|
శ్రద్ధామయోऽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః|| 17-3 ||
అర్జునా! ప్రతివారిలోని వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది. ఈ మానవుడు శ్రద్ధా మయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది ఔతుంది.
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः |
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः
యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః|| 17-4 ||
సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः |
दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः
అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః|
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః|| 17-5 ||
ఢంభాహంకారాలతో, ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన, పీడా కరమైన తపస్సు చేసే వారూ,
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः |
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान्
కర్షయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః|
మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్|| 17-6 ||
తెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలనూ, శరీరంలో ఉండేనన్ను కూడా హింసించే వాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో.
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः |
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః|
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు|| 17-7 ||
మానవులకు మూడు విధాలైన ఆహారం ప్రియమౌతుంది. యజ్ఞమూ, తపస్సూ, దానమూ కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను.
आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः |
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః|
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః|| 17-8 ||
ఆయువు సత్వగుణం, బలం, ఆరోగ్యం, సుఖం ప్రీతి వీటిని పెంచేవీ, రసంతో నిండినివీ, జిడ్డుతో నిగనిగలాడేవీ, కడుపులో చాలా కాలం ఉండేవీ, మనస్సునాకర్షించేవీ అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి.
कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः |
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః|
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః|| 17-9 ||
చేదూ, పులుపూ, ఉప్పూ, వేడీ, కారమూ, అన్నీ అతిగా కలిగి, పొడిపొడిగా ఉండి, దాహం పుట్టిస్తూ, దుఃఖాన్నీ, శోకాన్నీ, రోగాన్నీ కలిగించేవి రాజసికులకు ఇష్టం.
यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్|
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్|| 17-10 ||
వండిన తరువాత ఝాము దాటి పోయినదీ, రుచి పూర్తిగా పోయినదీ, పాసిపోయినదీ, వాసన గొట్టుతుందీ, ఎంగిలిదీ, అశుభ్రమైనదీ అయిన భోజనం తామసికులకు ఇష్టం.
अफलाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते |
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः
అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే|
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః|| 17-11 ||
ఫలాపేక్ష లేకుండా, శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగానూ, తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం.
अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् |
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम्
అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్|
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్|| 17-12 ||
అర్జునా! ఫలాన్ని ఆశిస్తూనో, డంభం కోసంమో చేయబడే యజ్ఞం రాజసిక యజ్ఞం అని తెలుసుకో
विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् |
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते
విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్|
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే|| 17-13 ||
శాస్త్ర విధి లేకుండా అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది.
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् |
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్|
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే|| 17-14 ||
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించడం, శుచిత్వం, సూటియైన ప్రవర్తన, బ్రహ్మచర్యం అహింస ఇవి శారీరక తపస్సులు.
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే|| 17-15 ||
ఇతరులను బాధింపనిదీ, సత్యనమూ, ప్రయమూ, హితమూ అయిన వాక్కు, స్వాధ్యాన్ని అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు.
मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే|| 17-16 ||
ప్రసన్నమైన మనస్సూ, మంచితనమూ, మౌనమూ, మనోనిగ్రహమూ, శుద్ధమైన భావాలూ-ఇవి మానసిక తపస్సు.
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः |
अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః|
అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే|| 17-17 ||
పై మూడు రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, ఏ లాభమూ కోరకుండా, నిగ్రహంచేత చేయబడినప్పుడు, సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది.
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम्
సత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్|
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్|| 17-18 ||
సత్కారంకోసమూ, మాన మర్యాద కోసమూ డంభంతోనూ ఏ తపస్సు చేయబడుతుందో దానిని నిలకడా, స్తిరత్వమూ లేని రాజసిక తపస్సుఅంటారు.
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः |
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम्
మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః|
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్|| 17-19 ||
సరిగ్గా అర్ధం చేసుకోకుండా, తన్ను తాను హింసించు కుంటూ లేదా ఇతరుకలకు పీడా కరంగా చేయబడే తామసికము అనబడుతుంది.
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे |
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम्
దాతవ్యమితి యద్దానం దీయతేऽనుపకారిణే|
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్|| 17-20 ||
దానం చేయడం కర్తవ్యం అనేభావంతో, తిరిగి ఉపకారం చేయని వారికి దేశకాల పాత్రలని చూచి, చేసిన దానం సాత్వికమని చెప్పబడుతుంది.
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः |
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम्
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః|
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్|| 17-21 ||
ప్రత్యుపకారం ఊద్దేశించిగాని, ఫలాన్ని ఆశించిగాని, బలవంతంగానూ, భాధపడుతూ ఇచ్చే దానిని రాజిసిక దాన మంటారు.
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते |
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम्
అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే|
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్|| 17-22 ||
అపాత్రునికి, తగని తగని సమయంలో, ఇవ్వకూడని చోట, అగౌరవంతో, అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది.
ॐतत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः |
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा
ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః|
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా|| 17-23 ||
ఓం తత్ సత్ అనే బ్రహ్మపదార్ధన్ని నిర్ధేశించే మూడు సంకేతాలని చెప్పబడుతుంది, వీటితోనే పూర్వం బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పరుపబడినాయి.
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः |
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम्
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః|
ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్|| 17-24 ||
అందుచేత "ఓం"అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యమూ యజ్ఞ దాన తపః కర్మలు చేయబడు తున్నాయి.
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः |
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः
తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః|
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః|| 17-25 ||
"తత్"అంటూ మోక్షాన్ని కాక్షించే వారు ఫలం ఆశించకుండా, వివిధాలైన యజ్ఞాలూ, తపస్సులూ చేస్తుంటారు.
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते |
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే|
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే|| 17-26 ||
పరమసత్యానికీ, మంచితనానికి సూచనగా "సత్"అనే పదాన్ని ప్రయోగిస్తారు. అర్జునా! మంచి కర్మలకు కూడా"సత్"అనే పదం ప్రయోగిప పడుతుంది.
यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते |
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే|
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే|| 17-27 ||
యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం"సత్"అని చెప్పబడుతుంది. దాని కోసం చేసే కర్మని కూడా "సత్"అనే అంటారు.
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् |
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ|| 17-28 ||
అలాంటిఅర్జునా! శ్రద్ధలేని హోమం, దానం, తపస్సు, మరి యే క్రియ అయినా సరే అది"అసత్"అని చెప్పబడుతుంది. అలాంటి కర్మ ఇహంలో కానీ, పరంలో కానీ ఫలం ఇవ్వదు