Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 6

Dhyana Yoga

ध्यानयोगः

Chapter 6 of 18 47 verses
Verse 1 Open →
श्रीभगवानुवाच |
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः |
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः
శ్రీభగవానువాచ|
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః|| 6-1 ||
శ్రీకృష్ణ భగవానుడు పలికినది: - కర్మఫలంపైన ఆధారపడకుండా, చేయవలసిన కర్మని ఎవరు చేస్తారో అతడే కర్మ సన్యాసీ, కానీ అగ్ని కార్యాన్నీ, కర్మనీ వదిలేసినవాడు కాదు.
Verse 2 Open →
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव |
न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन
యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ|
న హ్యసంన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన|| 6-2 ||
అర్జునా దేనిని సన్యాసమని అంటారో అదేయోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యసించనివాడు ఎవడూ యోగికాలేడు.
Verse 3 Open →
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते |
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే|
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే|| 6-3 ||
యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతుంది. యోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే సాధనమని చెప్పబడుతుంది.
Verse 4 Open →
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते |
सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते
యదా హి నేన్ద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే|
సర్వసఙ్కల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే|| 6-4 ||
ఎప్పుడైతే విషయ వస్తువులలోను, కర్మలలోనూ తగుల్కోకుండా సర్వ సంకల్పాలను వదిలి వేస్తాడో అప్పుడు యోగరూఢుడని పిలవబడతాడు.
Verse 5 Open →
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् |
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్|
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః|| 6-5 ||
తనను తానే ఉద్ధరించుకోవాలి. అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు. తనకు తానే శతృవు.
Verse 6 Open →
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः |
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्
బన్ధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః|
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్|| 6-6 ||
స్వాధీనమైన మనస్సు అతని బంధువు. స్వాధీనంలో లేని మనస్సు అతనికి శతృవై శతృత్వంతో వర్తిస్తుంది.
Verse 7 Open →
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः |
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः
జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః|
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః|| 6-7 ||
మనస్సుని జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో, సుఖదుఃఖాలలో మానావమానాలలో పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు.
Verse 8 Open →
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः |
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియః|
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాఞ్చనః|| 6-8 ||
జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందిన వాడు, పరమాత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలను జయించిన వాడు, మట్టి, రాయి, బంగారాలని సమంగా చూసేవాడు ఐన యోగి యుక్తుడని పిలవబడతాడు.
Verse 9 Open →
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु |
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబన్ధుషు|
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే|| 6-9 ||
మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్తులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు, బంధువులు, సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు విశిష్టుడు.
Verse 10 Open →
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः |
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः
యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః|
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః|| 6-10 ||
ఏకాంతంలో ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి, ఆశాపరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సుని ఆత్మలో లయం చేయాలి.
Verse 11 Open →
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः |
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః|
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్|| 6-11 ||
శుచియైన ప్రదేశంలో అట్టే ఎత్తుగానూకాక, మరీ కిందగానుకాక, దర్బాసనం మీద లేడి చర్మం, దానిమీద వస్త్రాన్ని పరచి స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని
Verse 12 Open →
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः |
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేన్ద్రియక్రియః|
ఉపవిశ్యాసనే యుఞ్జ్యాద్యోగమాత్మవిశుద్ధయే|| 6-12 ||
ఆ ఆసనంపైన కూర్చుని మనస్సుని ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి, ఆత్మ శుద్ధికోసం యోగాన్ని అభ్యసించాలి.
Verse 13 Open →
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः |
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః|
సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్|| 6-13 ||
శరీరాన్ని, మెడని, తలనీ నిటారుగా కదలకుండా నిటారుగా ఉంచి, దిక్కులు చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ
Verse 14 Open →
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः |
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः
ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః|
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః|| 6-14 ||
ప్రశాంతమైన మనస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి, మనస్సుని బాగా నిరోధించి, నాలో చిత్తాన్ని నిలిపి, నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యాన యుక్తుడై ఉండాలి.
Verse 15 Open →
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः |
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति
యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః|
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి|| 6-15 ||
మనస్సును నిగ్రహించి యోగి ఇలా ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో నిలిపి, నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన శాంతిని పొందుతాడు.
Verse 16 Open →
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः |
न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन
నాత్యశ్నతస్తు యోగోऽస్తి న చైకాన్తమనశ్నతః|
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున|| 6-16 ||
అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు.ఎల్లప్పుడు సాత్వికాహరమునె భుజించాలి
Verse 17 Open →
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु |
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు|
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా|| 6-17 ||
ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికీ, కర్మలో తగు మాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ తగుమాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ సమంగా పాటించే వానికీ యోగం(జన మరణ)దుఃఖాన్ని హరిస్తుంది.
Verse 18 Open →
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते |
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే|
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా|| 6-18 ||
ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింప బడిన మనస్సు ఆత్మలోనే ఉన్నప్పుడు అతడిని యోగ సిద్ధుడని అంటారు.
Verse 19 Open →
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता |
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः
యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా|
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః|| 6-19 ||
ఆత్మ సమ్యమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సునుని, గాలి లేని చోట ఉంచిన దీపం స్థిరంగా ఉండే స్థితితో పోల్చుతారు.
Verse 20 Open →
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया |
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా|
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి|| 6-20 ||
యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ(యోగి) ఆనందిస్తాడో,
Verse 21 Open →
सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् |
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः
సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్|
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః|| 6-21 ||
ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోతగినదో, ఇంద్రియాలకు అతీతమో, అంతంలేనిదో, ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ, ఆ అనుభవాన్నుంచి చలించకుండా ఉంటాడో,
Verse 22 Open →
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः |
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః|
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే|| 6-22 ||
దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖంచేతకూడా చలించడో,అతడె నిజమైన యోగి
Verse 23 Open →
तं विद्याद् दुःखसंयोगवियोगं योगसंज्ञितम् |
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा
తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్|
స నిశ్చయేన యోక్తవ్యో యోగోऽనిర్విణ్ణచేతసా|| 6-23 ||
దుఃఖంతో సంబంధం లేని స్థితిని యోగం అని తెలుసుకోవాలి, ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించాలి.
Verse 24 Open →
सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः |
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः
సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః|
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః|| 6-24 ||
సంకల్పవల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి పెట్టలి. మనస్సు ద్వారానే ఇంద్రియాలన్నింటిని అన్ని వైపులనుండి నిగ్రహించాలి.
Verse 25 Open →
शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया |
आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्
శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా|
ఆత్మసంస్థం మనః కృత్వా న కిఞ్చిదపి చిన్తయేత్|| 6-25 ||
ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని(బాహ్య ప్రపంచమ్నుండి మళ్ళించి)శాంతింప చేయాలి. మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.
Verse 26 Open →
यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् |
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत्
యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్|
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్|| 6-26 ||
నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.
Verse 27 Open →
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् |
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम्
ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్|
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్|| 6-27 ||
ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైయిన ఉత్తమ సుఖం లభిస్తుంది.
Verse 28 Open →
युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः |
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते
యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః|
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే|| 6-28 ||
ఇలా నిరంతరం ఆత్మాభ్యాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖాన్ని తేలికగా పొందుతాడు.
Verse 29 Open →
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि |
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని|
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః|| 6-29 ||
యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూస్తాడు.
Verse 30 Open →
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति |
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి|
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి|| 6-30 ||
నన్ను అన్నిటిలోనూ, నాలో అన్నిటినీ ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను. అతడు నాకూ మరుగు కాడు.
Verse 31 Open →
सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः |
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|
సర్వథా వర్తమానోऽపి స యోగీ మయి వర్తతే|| 6-31 ||
అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింటా పరమాత్మ ఒక్కడే అన్న భావం పొంది సేవిస్తారో, ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు.
Verse 32 Open →
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन |
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోऽర్జున|
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః|| 6-32 ||
అర్జునా దుఃఖంగానీ, సుఖంగానీ తనతో పోల్చుకుని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము.
Verse 33 Open →
अर्जुन उवाच |
योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन |
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम्
అర్జున ఉవాచ|
యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన|
ఏతస్యాహం న పశ్యామి చఞ్చలత్వాత్స్థితిం స్థిరామ్|| 6-33 ||
అర్జునుడు ఇలా అడిగాడు; - కృష్ణా నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం మనస్సు యొక్క చంచల స్వభావం వలన నిలుస్తుందని నాకు అనిపించడం లేదు.
Verse 34 Open →
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्
చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ దృఢమ్|
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్|| 6-34 ||
కృష్ణా మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను భావిస్తాను.
Verse 35 Open →
श्रीभगवानुवाच |
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते
శ్రీభగవానువాచ|
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్|
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే|| 6-35 ||
శ్రీ కృష్ణా భగవానుడు ఇలా అన్నాడు: - సందేహం లేదు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అది చలిస్తుంది. అయితే కుంతీ కుమారా! అభ్యాసం చేతా వైరాగ్యం ద్వారానూ మనోనిగ్రహం సాధ్యం ఔతుంది.
Verse 36 Open →
असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः |
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः
అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః|
వశ్యాత్మనా తు యతతా శక్యోऽవాప్తుముపాయతః|| 6-36 ||
మనస్సు స్వాధీనంలో లేని వాడికి యోగం పొందడం కష్టమని నా అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించ వచ్చును.
Verse 37 Open →
अर्जुन उवाच |
अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः |
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति
అర్జున ఉవాచ|
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః|
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి|| 6-37 ||
అర్జునుడన్నాడు: - శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోయేవాడు, యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనపుడు ఏమౌతాడు.
Verse 38 Open →
कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति |
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि
కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి|
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి|| 6-38 ||
ఓ మహానుభావా! బ్రహ్మ పధంలో నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించి పోడా?
Verse 39 Open →
एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः |
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః|
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే|| 6-39 ||
కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా చేదించ తగిన వాడివి నీవే. నా అనుమానాన్ని తీర్చగలిగిన వాళ్ళు లోకంలో నీకంటే ఎవరూ లేరు.
Verse 40 Open →
श्रीभगवानुवाच |
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते |
न हि कल्याणकृत्कश्चिद् दुर्गतिं तात गच्छति
శ్రీభగవానువాచ|
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే|
న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి|| 6-40 ||
శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: - అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవరూ దుర్గతిని పొందడు కదా.
Verse 41 Open →
प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः |
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః|
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోऽభిజాయతే|| 6-41 ||
యోగబ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన వారి ఇంట్లో జన్మిస్తాడు.
Verse 42 Open →
अथवा योगिनामेव कुले भवति धीमताम् |
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्
అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్|
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్|| 6-42 ||
లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకంలో ఇలాటి జన్మ చాలా అరుదైనది.
Verse 43 Open →
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् |
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్|
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన|| 6-43 ||
కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.
Verse 44 Open →
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः |
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః|
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే|| 6-44 ||
పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన యోగ భ్రష్టుడు వివశుడై యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం చూపినా, ఓంకారాన్ని జపించడం వలన లభించే వైదిక కర్మ ఫలాన్ని దాటి పోతాడు.
Verse 45 Open →
प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः |
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః|
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్|| 6-45 ||
యోగి దీక్షతో చేసే ప్రయత్నం వలన పాపాలన్నింటి నుండి విడివడి శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని(మోక్షం)చేరుకుంటాడు.
Verse 46 Open →
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः |
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन
తపస్విభ్యోऽధికో యోగీ జ్ఞానిభ్యోऽపి మతోऽధికః|
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున|| 6-46 ||
అర్జునా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, కర్మచేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ (ఆత్మ సంయమ)యోగివి కా.
Verse 47 Open →
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना |
श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः
యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా|
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః|| 6-47 ||
యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా ఎవరు సేవిస్తారో. అతడు ఉత్తముడని నాఅభిప్రాయము.