Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 16

Daivasura Sampad Vibhaga Yoga

दैवासुरसम्पद्विभागयोगः

Chapter 16 of 18 24 verses
Verse 1 Open →
श्रीभगवानुवाच |
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः |
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्
శ్రీభగవానువాచ|
అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్|| 16-1 ||
అభయం సత్వసుద్ధి జ్ఞానయోగంలో నిలవడం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ(దైవీ పురుషుడికి కలుగుతాయి)
Verse 2 Open →
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् |
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्
అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్|
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్|| 16-2 ||
అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం
Verse 3 Open →
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత|| 16-3 ||
తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.
Verse 4 Open →
दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च |
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम्
దమ్భో దర్పోऽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్|| 16-4 ||
అర్జునా! దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం. . . ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.
Verse 5 Open →
दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता |
मा शुचः सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव
దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|
మా శుచః సమ్పదం దైవీమభిజాతోऽసి పాణ్డవ|| 16-5 ||
దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణం. అర్జునా! విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు.
Verse 6 Open →
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च |
दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु
ద్వౌ భూతసర్గౌ లోకేऽస్మిన్దైవ ఆసుర ఏవ చ|
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు|| 16-6 ||
ఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవసృష్టిని గురించి విస్తారంగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టి గురించివిను.
Verse 7 Open →
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः |
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే|| 16-7 ||
అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.
Verse 8 Open →
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् |
अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम्
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|
అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్|| 16-8 ||
జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టినదనీ వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు.
Verse 9 Open →
एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः |
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోऽల్పబుద్ధయః|
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః|| 16-9 ||
ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు.
Verse 10 Open →
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः |
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः
కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేऽశుచివ్రతాః|| 16-10 ||
వాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన, మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా ప్రవర్తిస్తారు.
Verse 11 Open →
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः |
कामोपभोगपरमा एतावदिति निश्चिताः
చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః|
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః|| 16-11 ||
వాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ, కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వాళ్ళు.
Verse 12 Open →
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः |
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान्
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్|| 16-12 ||
వాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై తమ కామభోగానికిగాను, అన్యాయంగానైనా సరే సంపదలను సమకూర్చుకోవాలని అనుకుంటారు.
Verse 13 Open →
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् |
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम्
ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్|
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్|| 16-13 ||
ఈ రోజు ఇంత సంపద నాకు లభించింది. ఈ కోరికలని తీర్చుకుంటాను. ఇంత ధనం నాకుంది. ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది.
Verse 14 Open →
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि |
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी
అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి|
ఈశ్వరోऽహమహం భోగీ సిద్ధోऽహం బలవాన్సుఖీ|| 16-14 ||
ఈ శత్రువు నాచే చంపబడినాడు, ఇతరులను కూడా చంపేస్తాను. నేను ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని.
Verse 15 Open →
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया |
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः
ఆఢ్యోऽభిజనవానస్మి కోऽన్యోऽస్తి సదృశో మయా|
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః|| 16-15 ||
నేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?యజ్ఞం చేస్తాను. దానాలిస్తాను, సంతోషిస్తాను ఇలా అజ్ఞానంతో భ్రాంతి చెందుతారు.
Verse 16 Open →
अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः |
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ
అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః|
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేऽశుచౌ|| 16-16 ||
అనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని, కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకంలో పడతారు.
Verse 17 Open →
आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः |
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम्
ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః|
యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్|| 16-17 ||
తమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో కూడుకుని, గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్ణించి నామమాత్రంగా యజ్ఞాలు చేస్తారు.
Verse 18 Open →
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः |
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోऽభ్యసూయకాః|| 16-18 ||
అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని, తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
Verse 19 Open →
तानहं द्विषतः क्रुरान्संसारेषु नराधमान् |
क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु
తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్|
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు|| 16-19 ||
ఇలా నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ నేను అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
Verse 20 Open →
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि |
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम्
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని|
మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్|| 16-20 ||
అర్జునా! అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.
Verse 21 Open →
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः |
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్|| 16-21 ||
ఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు-కామం, క్రోధం, లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించాలి.
Verse 22 Open →
एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः |
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम्
ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః|
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్|| 16-22 ||
కౌంతేయా! నరక ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి విడుదల పొందిన నరుడు, తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు. దాని వలన పరమగతిని పొందుతాడు.
Verse 23 Open →
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः |
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम्
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్|| 16-23 ||
తన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు కార్యసిద్ధిని పొందడు. సుఖాన్ని పరమగతిని కూడా పొందడు.
Verse 24 Open →
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ |
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ|
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి|| 16-24 ||
=అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్నినిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ నీవు కర్మ చెయ్యడం మంచిది.