Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 15

Purushottama Yoga

पुरुषोत्तमयोगः

Chapter 15 of 18 20 verses
← Previous Next →
Verse 1 Open →
श्रीभगवानुवाच |
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् |
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्
శ్రీభగవానువాచ|
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్|| 15-1 ||
శ్రీ భగవానుడన్నాడు:మొదలు పైకి శాఖలు క్రిందకు ఉన్న అశ్వత్థానిని అవ్యయమైనదని పెద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగినవాడు వేదాలను ఎరిగినట్లే.
Verse 2 Open →
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धा विषयप्रवालाः |
अधश्च मूलान्यनुसन्ततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః|
అధశ్చ మూలాన్యనుసన్తతాని
కర్మానుబన్ధీని మనుష్యలోకే|| 15-2 ||
దానికొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి. గుణాలచే పెరుగుతాయి. విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధిస్తాయి. దాని వేళ్ళు క్రింద బాగా పాతుకొని మనుష్య లోకం అంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి.
Verse 3 Open →
न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा |
अश्वत्थमेनं सुविरूढमूलं
असङ्गशस्त्रेण दृढेन छित्त्वा
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా|
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా|| 15-3 ||
దాని రూపము ఆ ప్రకారము(తల క్రింద ఉండే చెట్టులా)ఇక్కడ కనిపించదు. దాని మొదలూ, తుదీ, ఆధారము ఏవీ కనిపించదు. గట్టిగా పాతుకు పోయిన ఈ అశ్వత్థానిని దృఢమైన అసంగ భావమనే ఆయుధంతో ఛేధించి,
Verse 4 Open →
ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन्गता न निवर्तन्ति भूयः |
तमेव चाद्यं पुरुषं प्रपद्ये |
यतः प्रवृत्तिः प्रसृता पुराणी
తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్గతా న నివర్తన్తి భూయః|
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే|
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ|| 15-4 ||
ఆ తరవాత ఎక్కడికి పోతే మరలా తిరిగి రారో ఆ స్థానాన్ని వెదకాలి. ఎవరినుండి ఈ పురాతన సృష్టి కార్యము ప్రారంభము ఐనదో , ఆ ఆది పురుషుణ్ణే నేను శరణు వేడుతాను.
Verse 5 Open →
निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः |
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैर्-
गच्छन्त्यमूढाः पदमव्ययं तत्
నిర్మానమోహా జితసఙ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|
ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్-
గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్|| 15-5 ||
మానవ మోహాన్ని త్యజించిన వాళ్ళూ, సంగదోషాన్ని జయించిన వాళ్ళూ, సదా ఆత్మ జ్ఞానంలో నిమగ్నమైన వారు, విషయ వాంఛలన్నీ వెనుకకు మరలించిన వాళ్ళూ, సుఖ దుఃఖాలనే ద్వందాలనుండి విముక్తులైన వారు, మూఢత్వము పోయి అవ్యయ పదాన్ని చేరు కుంటారు.
Verse 6 Open →
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम
న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః|
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ|| 15-6 ||
ఆ పదాన్ని సూరుడు, చంద్రుడు, అగ్ని వెలిగించరు. ఎక్కడకు వెళితే తిరిగి రారో అది నా పరమ ధామము.
Verse 7 Open →
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः |
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః|
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి|| 15-7 ||
సనాతనమైన నా అంశే జీవలోకములో జీవుడిగా మారి, ప్రకృతినుండి మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియాలను ఆకర్షిస్తుంది.
Verse 8 Open →
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः |
गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात्
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః|
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్|| 15-8 ||
ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడూ, విడిచినప్పుడూ వాయువు పూలలోంచి వాసనను తీసుకుపోయే విధముగా ఈ ఆరింటిని తీసుకొని ప్రయాణిస్తాడు.
Verse 9 Open →
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च |
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ|
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే|| 15-9 ||
చెవీ, ముక్కూ, కన్నూ, నాలుకాచర్మమూ, మనస్సు వీటిని అధిష్టించి జీవుడు విషయాలను అనుభవిస్తాడు.
Verse 10 Open →
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् |
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः
ఉత్క్రామన్తం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్|
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః|| 15-10 ||
శరీరము నుండి నిష్క్రమించేటప్పుడు కానీ, శరీరంలో ఉన్నప్పుడు కానీ విమూఢులు ఈయనను చూడరు. జ్ఞానులు మాత్రమే చూస్తారు.
Verse 11 Open →
यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् |
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः
యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోऽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః|| 15-11 ||
సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశను చూడకలరు. మస్సు పరిపక్వము కాని వారు వివేకహీనులు సరైన జ్ఞానము లేనందువలన సాధన చేసినా చూడలేరు.
Verse 12 Open →
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् |
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్|
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్|| 15-12 ||
జగత్తు నంతటినీ వెలిగించే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న తేజస్సు ఏదో అది నాదని తెలుసుకో.
Verse 13 Open →
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा |
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా|
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః|| 15-13 ||
భూమిలోనికి ప్రవేశించి ప్రాణులందరిని నేను నా శక్తితో భరిస్తాను. ఇంకా రసాత్మకుడైన చంద్రుడిని అయి ఓషధులన్నింటికీ పుష్టి ని ఇస్తాను.
Verse 14 Open →
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः |
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 15-14 ||
నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణ ఆపానములతో కలిసి నాలుగు రకముల అన్నాన్ని ఆరగిస్తాను.
Verse 15 Open →
सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च |
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् ||१५||
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనఞ్చ|
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్|| 15-15 ||
ఇక నేను అందరి హృదయాలలో ప్రవేశించి ఉన్నాను. నానుండే జ్ఞానము, జ్ఞాపకము, మరుపూ కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా తెలియబడవలసిన వాడిని నేనే, వేదాంతాన్నిచేసిన వాడిని, వేదాన్ని తెలుసుకునే వాడిని కూడా నేనే.
Verse 16 Open →
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च |
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ|
క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే|| 15-16 ||
శరీరం అనబడు లోకములో క్షరుడూ, అక్షరుడు అనే ఇద్దరు పురుషులు ఉన్నారు. అందులో క్షర పురుషున్ని జీవాత్మ గానూ , అక్షర పురుషున్ని ఆత్మగానూ చెప్పారు. ప్రతి శరీరంలోనూ జీవాత్మ(క్షరుని) తోపాటు అక్షరుడైన ఆత్మ కూటస్థంగా వున్నాడు.
Verse 17 Open →
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युधाहृतः |
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః|
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః|| 15-17 ||
ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతడిని పరమాత్మ అంటారు. నాశనము లేని ఆ ఈశ్వరుడు మూడు లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు.
Verse 18 Open →
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः |
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः
యస్మాత్క్షరమతీతోऽహమక్షరాదపి చోత్తమః|
అతోऽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః|| 15-18 ||
నేను క్షరానికి అతీతుడిని మరియు, అక్షరుడికన్నా కూడా ఉత్తముడినికనుక ఈ లోకములోనూ వేదములోనూ పురుషోత్తముడిగా కీర్తింపబడ్డాను.
Verse 19 Open →
यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् |
स सर्वविद्भजति मां सर्वभावेन भारत
యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత|| 15-19 ||
అర్జునా! పురుషోత్తముడిని అయిన నన్ను ఈ విధముగా ఏ జ్ఞాని తెలుసుకుంటాడో, అతడు సర్వమూ తెలిసిన వాడై అన్ని విధములుగా నన్ను సేవిస్తాడు(పొందుతాడు).
Verse 20 Open →
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ |
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ|
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత|| 15-20 ||
భారతా అలా గోప్యమైన ఈ శాస్తం నాచే చెప్పబడినది. దీనిని అర్ధము చేసుకుంటే బుద్ధిమంతుడూ కృతకృత్యుడూ ఔతాడు.