Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 13

Kshetra Kshetrajna Vibhaga Yoga

क्षेत्रक्षेत्रज्ञविभागयोगः

Chapter 13 of 18 35 verses
Verse 1 Open →
अर्जुन उवाच |
प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च |
एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव
అర్జున ఉవాచ|
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ|
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ|| 13-1 ||
అర్జునుడిట్లనియెను: హే కేశవా! ప్రకృతియననేమి? పురుషుడెవ్వడు? క్షేత్రమనగానేమి? క్షేత్రజ్ఞుడెవ్వడు? జ్ఞానమనగానేమి? జ్ఞేయస్వరూపమెట్టిది? వీటిని గూర్చి తెలియగోరుచున్నాను.
Verse 2 Open →
श्रीभगवानुवाच |
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते |
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः
శ్రీభగవానువాచ|
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః|| 13-2 ||
శ్రీ భగవానుడిట్లనియెను: ఓ అర్జునా! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. ఈ క్షేత్ర ధర్మము నెవడెరుంగునో వానిని క్షేత్రజ్ఞుడని ఈ విషయమును తెలిసినవారు చెప్పుదురు.
Verse 3 Open →
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत |
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత|
క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ|| 13-3 ||
మరియు ఓ అర్జునా! సర్వదేహములందుండెడి క్షేత్రజ్ఞుడైన జీవుని నన్నుగా ఎరుగుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులగూర్చి తెలిసికొనెడి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా మతము.
Verse 4 Open →
तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् |
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్|
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు|| 13-4 ||
ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారము కలదియో, దేనివలన బుట్టినదో, ఆ క్షేత్రజ్ఞుడెవ్వడో, ఎట్టి ప్రభావము గలవాడో ఆ సంగతిని సంగ్రహముగా నాద్వారా వినుము.
Verse 5 Open →
ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् |
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः
ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్|
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః|| 13-5 ||
ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విషయము మహర్షుల చేత అనేక విధాలుగా వివరింపబడినది. పెక్కు శాఖలు కలిగిన వేదాలలో ఇది పలు విధములుగా విభజించి నిరూపించబడినది. బ్రహ్మసూత్ర పదాలు దీనిని గురించి హేతు బద్ధంగా నిశ్చయించి చెప్పాయి.
Verse 6 Open →
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च |
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ|
ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః|| 13-6 ||
మహాభూతాలు(ఐదు)అహంకారము, బుద్ధి, అవ్యక్తము(అష్టవిధ ప్రకృతి), ఇంద్రియాలు పది, మనస్సు, ఇంద్రియ గోచరవిషయాలు ఐదూ(మొత్తం 24క్షేత్రాలు)
Verse 7 Open →
इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः |
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम्
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః|
ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్|| 13-7 ||
ఇచ్చ, ద్వేషం, సుఖఅం, దుఃఖం, శరీరం, చేతనత్వం, పట్టుదల ఇవి వికారాలతో కూడిన క్షేత్రం అని సంగ్రహంగా చెప్పడమైంది.
Verse 8 Open →
अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् |
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः
అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్|
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః|| 13-8 ||
తనని తాను పొగడక పోవడం, ఢంభము లేకుండా ఉండడమూ, అహింసా, ఓర్పూ, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వమూ, స్తిరత్వమూ, ఆత్మనిగ్రహమూ.
Verse 9 Open →
इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च |
जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम्
ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ|
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్|| 13-9 ||
ఇంద్రియ విషయాలలో వైరాగ్యమూ అహంకారము లేకపోవడము , పుట్టుకలో, చావులో, ముసలితనంలో, రోగంలో, దుఃఖాన్ని, దోషాన్ని నిత్యమూ చూడటమూ,
Verse 10 Open →
असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु |
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु
అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు|
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు|| 13-10 ||
ఆసక్త భావము లేకపోవడము, పుత్రులు-భార్య గృహము మొదలైన వాటితోతాధాత్మ్యము చెందక పోవడము, ఇష్టాలు ప్రాప్తించినా, ఇష్టం కానిది ప్రాప్తించినా మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడమూ,
Verse 11 Open →
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी |
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ|
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది|| 13-11 ||
ఇంకా, నాలోఅనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తీ, ఏకాంతంలో గడపడమూ, జనసమర్ధంలో అభిరుచి లేకపోవడమూ,
Verse 12 Open →
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् |
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోऽన్యథా|| 13-12 ||
19.నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము ఉండడమూ, 20.తత్వ జ్ఞానము యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానమని చెప్పబడింది. దానికి భిన్నమైనది అంతా అజ్ఞానము.
Verse 13 Open →
ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते |
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते
జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే|
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే|| 13-13 ||
దేనిని తెలుసుకోవడము వలన జీవుడు అమృతత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము. అది సత్తు కాదని, అసత్తు కాదని చెప్పబడుతుంది.
Verse 14 Open →
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् |
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति
సర్వతః పాణిపాదం తత్సర్వతోऽక్షిశిరోముఖమ్|
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి|| 13-14 ||
దానికి అంతటా చేతులు, కాళ్ళూ, కళ్ళు, తలలూ, నోళ్ళు, చెవులు ఉండి, అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది.
Verse 15 Open →
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् |
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च
సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్|
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ|| 13-15 ||
అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది, ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణ హీనమైనా కూడా గుణాలను భోగించేది.
Verse 16 Open →
बहिरन्तश्च भूतानामचरं चरमेव च |
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत्
బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ|
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్|| 13-16 ||
అది(జ్ఞేయము)జీవుళ్ళకు బయటా, లోపలా ఉండేది, కదిలేది కదలనిది కూడా ఐనా, సూక్ష్మము ఐనందువలన తెలియబడదు. (అవిద్వాంసులకు)దూరంగానూ, విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది.
Verse 17 Open →
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् |
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్|
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ|| 13-17 ||
ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా, జీవుళ్ళలో విభజింపబడి నట్లుగానూ, జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి.
Verse 18 Open →
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते |
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम्
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే|
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్|| 13-18 ||
వెలుగలకు వెలుగది. (అజ్ఞానమనే)చీకటికి ఆవల ఉన్నదని చెప్పబడుతుంది. అదే జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞాన గమ్యమూ అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది.
Verse 19 Open →
इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः |
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః|
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే|| 13-19 ||
క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడినాయి. నా భక్తుడు దీనిని తెలుసుకొని నాభావాన్ని(మోక్షాన్ని) పొందుతాడు.
Verse 20 Open →
प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि |
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్|| 13-20 ||
ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలూ, గుణాలూ ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో.
Verse 21 Open →
कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते |
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే|| 13-21 ||
కార్యకార్యాల తయారీకి ప్రకృతి కారణము అని చెప్పబడుతుంది. సుఖదుఃఖాల అనుభవాలకు కర్త పురుషుడని చెప్పబడతాడు.
Verse 22 Open →
पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् |
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు|| 13-22 ||
ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచీ, చెడు జన్మలెత్తడానికి కారణము.
Verse 23 Open →
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः |
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః|| 13-23 ||
ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అనీ, అనుమతించేవాడనీ, భరించేవాడనీ, భోగించేవాడనీ, మహేశ్వరుడనీ పరమాత్మ అనీ చెప్పబడుతున్నాడు.
Verse 24 Open →
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह |
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే|| 13-24 ||
పూర్వము చెప్పిన విధంగా పురుషుణ్ణీ, గుణాలతో సహా ప్రకృతినీ ఎవరు తెలుసుకుంటారో, అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు.
Verse 25 Open →
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना |
अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे
ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే|| 13-25 ||
కొందరు ధ్యానము ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూస్తారు. కొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరి కొందరు కర్మ యోగము ద్వారాను ఆత్మను చూస్తారు.
Verse 26 Open →
अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते |
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः
అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|
తేऽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః|| 13-26 ||
ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, అలా విన్న దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు.
Verse 27 Open →
यावत्सञ्जायते किञ्चित्सत्त्वं स्थावरजङ्गमम् |
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ
యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ|| 13-27 ||
భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.
Verse 28 Open →
समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् |
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति
సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి|| 13-28 ||
నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.
Verse 29 Open →
समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् |
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम्
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్|| 13-29 ||
సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.
Verse 30 Open →
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः |
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి|| 13-30 ||
అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు.
Verse 31 Open →
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति |
तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా|| 13-31 ||
ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.
Verse 32 Open →
अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः |
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోऽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే|| 13-32 ||
ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.
Verse 33 Open →
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते |
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే|| 13-33 ||
ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మ తత్వం వలన దేనిచేతా అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.
Verse 34 Open →
यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः |
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత|| 13-34 ||
ఓ భారతా! ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని ప్రకాశింప చేస్తాడో, అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రశింప చేస్తాడు.
Verse 35 Open →
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा |
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्
క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా|
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్|| 13-35 ||
ఈ ప్రకారంగా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పదాన్ని చేరుకుంటారు.