Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 12

Bhakti Yoga

भक्तियोगः

Chapter 12 of 18 20 verses
← Previous Next →
Verse 1 Open →
अर्जुन उवाच |
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते |
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः
అర్జున ఉవాచ|
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే|
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః|| 12-1 ||
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంతభక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగవిదులెవరు?
Verse 2 Open →
श्रीभगवानुवाच |
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते |
श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः
శ్రీభగవానువాచ|
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః|| 12-2 ||
శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజనధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్దాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.(వారు సగుణోపాసన లేదా నిర్గుణోపాసన లలొ ఏది ఐనను అనుసరించవచ్చు)
Verse 3 Open →
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते |
सर्वत्रगमचिन्त्यञ्च कूटस्थमचलन्ध्रुवम्
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే|
సర్వత్రగమచిన్త్యఞ్చ కూటస్థమచలన్ధ్రువమ్|| 12-3 ||
కాని ఇంద్రియసముదాయమును చక్కగా వశపరచుకొనినవారును, సకల భూతములకును హితమునే కోరుచుండువారును, సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు.
Verse 4 Open →
सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः |
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः
సన్నియమ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః|
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః|| 12-4 ||
అట్టివారు మనోబుద్దులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును ఐన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై, ధ్యానము చేయుచు, భక్తితో భజించుచు, ఆ పరబ్రహ్మమునే పొందుదురు.
Verse 5 Open →
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् |
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते
క్లేశోऽధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్||
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే|| 12-5 ||
నిరాకార బ్రహ్మలో మనస్సు నిలిపిన వాళ్ళకు ప్రయాస ఎక్కువ. దేహధారులకు నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడము చాలా కష్టం.
Verse 6 Open →
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्परः |
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते
యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరః|
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే|| 12-6 ||
సర్వకర్మలన్నీనాలో వదిలి, నన్నే లక్ష్యముగా పెట్టుకుని మనస్సుని అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో,
Verse 7 Open →
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् |
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम्
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్|
భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్|| 12-7 ||
అర్జునా నా యందే మనసు నిలిపిన వాళ్ళను త్వరలోనే మృత్యుసంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను.
Verse 8 Open →
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय |
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః|| 12-8 ||
నాలోనే మనసు నిలుపు బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరవాత నాలోనే నివిసిస్తావు. ఇందులో సందేహం లేదు.
Verse 9 Open →
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् |
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనఞ్జయ|| 12-9 ||
ధనంజయా స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు.
Verse 10 Open →
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव |
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि
అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి|| 12-10 ||
అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.
Verse 11 Open →
अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः |
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्
అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్|| 12-11 ||
నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధుడివైతే నన్ను శరణు పొంది నీ కోసం చేసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
Verse 12 Open →
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते |
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम्
శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే|
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్|| 12-12 ||
అభ్యాసంకంటే జ్ఞానం మేలు. జ్ఞానంకన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వలన తరవాత శాంతి(మోక్షం) కలుగుతుంది.
Verse 13 Open →
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च |
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ||१३||
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ|
నిర్మమో నిరహఙ్కారః సమదుఃఖసుఖః క్షమీ|| 12-13 ||
ఏ ప్రాణిని ద్వేషించని వాడు, అహంకార మమకారాలు లేని వాడు, సుఖదుఃఖాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమా గుణం కలవాడు,
Verse 14 Open →
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः |
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः
సన్తుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః|
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః|| 12-14 ||
నిత్యము సంతుష్టుడై , యోగియై, మనో నిగ్రహం కలవాడై, దృఢమైన నిశ్చయముతో, మనో బుద్ధులను నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు.
Verse 15 Open →
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः |
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః|| 12-15 ||
ఎవరివల్ల లోకం వ్యధ చెందదో, లోకం వలన ఎవడు వ్యధ చెందడో, సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడు నాకు ప్రియుడు.
Verse 16 Open →
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः |
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః|| 12-16 ||
అపేక్ష లేని వాడు, శుచియైన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధలు నశించిన వాడు, అన్ని విధాలైన, కార్యాలలలో నేను చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు.
Verse 17 Open →
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति |
शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి|
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః|| 12-17 ||
ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో , శుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.
Verse 18 Open →
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः |
शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః|| 12-18 ||
శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు వీటియందు సమంగా ఉండే వాడు సంగాన్ని విడిచే వాడు(నాకు ఇష్టుడు)
Verse 19 Open →
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् |
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः
తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః|| 12-19 ||
నిందాస్తుతులను తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండే వాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర లేని వాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.
Verse 20 Open →
ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते |
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః|| 12-20 ||
ధర్మయుక్తమూ, శాశ్వతమూ అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో, నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆభక్తులే నాకు పరమ ప్రియులు.