श्रीभगवानुवाच |
भूय एव महाबाहो शृणु मे परमं वचः |
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया
శ్రీభగవానువాచ|
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః|
యత్తేऽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా|| 10-1 ||
శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు:- ఓమహానుభావా! అర్జునా! నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు కలగాలని, నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను.
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः |
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః|
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః|| 10-2 ||
నా పుట్టుకను గురించి దేవతలుకాని మహర్షులుకాని ఎరుగరు. దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను.
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् |
असम्मूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్|
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే|| 10-3 ||
పుట్టుకా మొదలులేని వాడిగానూ, లోకాలకు ప్రభువుగాను నన్ను తెలుసుకున్న వాడు మనుష్యులలో జ్ఞాని అయి అన్ని పాపాలనుండి విముక్తి చెందుతాడు.
बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः |
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च
బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః|
సుఖం దుఃఖం భవోऽభావో భయం చాభయమేవ చ|| 10-4 ||
తెలివి, జ్ఞానం, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడమూ, లేకపోవడమూ, భయాభయాలు (నా వలననే కలుగుతాయి)
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः |
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోऽయశః|
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః|| 10-5 ||
అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు, అపయశస్సు మొదలైన వేరు వేరు భావాలు జీవుళ్ళలో నా వలననే కలుగుతాయి.
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा |
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః|| 10-6 ||
సృష్టి ఆరంభంలో ఉన్న సప్తఋషులు, నలుగురు మనువులు నా సంకల్పము వలన పుట్టిన వారే. వారి నుండి ఈ ప్రజలు వచ్చారు.
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः |
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః|
సోऽవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః|| 10-7 ||
ఈ నా విభూతి యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు, చలించని యోగంలో నిలిచి పోతాడు. ఇందులో సందేహము లేదు.
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते |
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే|
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః|| 10-8 ||
నేను అన్నిటి పుట్టుకకి హేతువుని నా వలననే సమస్తమూ నడుస్తుందని తెలుసుకున్న వివేకులు భక్తి పూరితులై నన్ను సేవిస్తారు.
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् |
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ|| 10-9 ||
తమ మనసులను నాలో లీనము చేసి జీవితాలను నాకే అర్పించి, నన్ను గురించే పరస్పరమూ బోధించుకుంటూ, చెప్పుకుంటూ నిత్యమూ తృప్తి పడతారు, ఆనందిస్తారు.
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् |
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్|
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే|| 10-10 ||
అలాసతతమూ మనసు నాయందుంచి, ప్రీతితో సేవించే వారికి నన్ను చేరుకోవడానికి కావలసిన జ్ఞానయోగాన్ని నేను కలుగచేస్తాను.
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः |
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता
తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమః|
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా|| 10-11 ||
వారిని కనికరించడం కోసమే నేను వారి మనస్సులలో నిలిచి, వారి అజ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞానదీపంతో నశింపజేస్తాను.
अर्जुन उवाच |
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् |
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम्
అర్జున ఉవాచ|
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్|
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్|| 10-12 ||
అర్జునుడు ఇలా అన్నాడు:- నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి, దివ్యుడివి, పరమ పురుషుడివి ఆది దేవుడివి. , పుట్టుక లేనివాడివి.
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा |
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా|
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే|| 10-13 ||
అని అందరూ ఋషులు, దేవర్షి నారదుడూ, అలాగే అశితుడూ, దేవలుడూ, వ్యాసుడూ అంటారు. స్వయంగా నీవుకూడా అలాగే చెబుతున్నావు.
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव |
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ|
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః|| 10-14 ||
కేశవా! నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వశిస్తున్నాను నీవ్యక్త శరీరాన్ని దేవతలుకాని దానవులు కాని ఎరుగరు.
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम |
भूतभावन भूतेश देवदेव जगत्पते
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ|
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే|| 10-15 ||
భూత భావనుడా! భూతేశా! జగత్పతీ! పురుషోత్తమా! నిన్ను నీవే నీచేతనే స్వయంగా ఎరుగుదువు.
वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः |
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః|
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి|| 10-16 ||
ఏయేవిభూతులలో నీవు ఈలోకమంతటా వ్యాపించి వున్నావో ఆదివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగినవాడివి.
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् |
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया
కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్|
కేషు కేషు చ భావేషు చిన్త్యోऽసి భగవన్మయా|| 10-17 ||
ఓయోగీ! సదాధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను?భగవంతుడా ఏయేరూపాలతో నిన్ను ధ్యానించవచ్చు?
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन |
भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम्
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన|
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేऽమృతమ్|| 10-18 ||
ఓజనార్ధనా! నీ యోగాన్ని విభూతిని విస్తారంగా చెప్పు. అమృతతుల్యమైన నీమాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు.
श्रीभगवानुवाच |
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः |
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे
శ్రీభగవానువాచ|
హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే|| 10-19 ||
శ్రీ భగవానుడన్నాడు:అర్జునా! నా దివ్య విభూతులలో ముక్యమైన వాటిని ఇప్పుడు నీకు చెబుతాను. నా విస్తారానికి అంతు అంటూ లేదు.
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः |
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ|| 10-20 ||
గుడాకేశా! నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల అది మధ్యంతాలు(సృష్టి స్థితి లయాలు)నేనే.
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् |
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ|| 10-21 ||
నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలిగించే వాళ్ళలో కిరనాలు కలిగిన సూర్యుడిని. మరుత్తులలో మరీచినీ, నక్షత్రాలలో చంద్రుడిని.
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः |
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना
వేదానాం సామవేదోऽస్మి దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా|| 10-22 ||
నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలళో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని.
रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् |
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम्
రుద్రాణాం శఙ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్|
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్|| 10-23 ||
నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసులలో కుబేరుడిని, వసువులలో పావకుడిని, పర్వతాలలో మేరువుని.
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् |
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్|
సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః|| 10-24 ||
అర్జునా! నేను పురోహితులలో శ్రేష్టుడైన బ్రుహస్పతిని. సేనానాయకులలో కుమారస్వామిని, సరసులలో సాగరాన్ని అని తెలుసుకో.
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् |
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్|
యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః|| 10-25 ||
మహర్షులలో భ్రుగువుని, శబ్దాలలో ఏకాకషరమైన ఓంకారాన్ని. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని.
अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः |
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః|
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః|| 10-26 ||
నేను వృక్షాలలో రావి చెట్టుని. దేవర్షులలో నారదుణ్ణి. గంధర్వులలో చిత్రరధుణ్ణి, సిద్ధులలో కపిల మునిని.
उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् |
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम्
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్|
ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్|| 10-27 ||
నేను గుర్రాలలో అమౄతంతో పుట్టిన ఉచ్చైశ్వాన్ని, ఏనుగులలో ఇరావతాన్ని, మనుష్యులలో రాజుని.
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् |
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||
నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మనమధుడిని, సర్పాలలో వాసుకిని.
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् |
पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम्
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 ||
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వ్రుణూడిని, పీరులలో ఆర్యముడిని, సమ్యమవంతులలో నిగ్రహాన్ని.
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् |
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम्
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోऽహం వైనతేయశ్చ పక్షిణామ్|| 10-30 ||
నేను దైత్యులలో ప్రహ్లాదుడీని, లెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్ని, మృగాలలో మృగేంద్రుడిని, పక్షులలో గరుత్మంతుడిని.
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् |
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్|
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ|| 10-31 ||
నేను పావనం చేసేవాళ్ళల్లో వాయువుని శస్త్రధారులలో రాముడిని, జలచరాలలో ముసలిని, నదులలో గంగని.
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन |
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्
సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున|
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్|| 10-32 ||
అర్జునా! సృష్టులన్నిట్లో ఆదిమధ్యాంతాలు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యని, వాదించేవాళ్ళల్లో వాదాన్ని నేనే.
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च |
अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः
అక్షరాణామకారోऽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ|
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః|| 10-33 ||
నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనంలేని కాలాన్ని. సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని.
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् |
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్|
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా|| 10-34 ||
నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఊదయించబోయే వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా గుణాలు కూడానేనే.
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् |
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్|
మాసానాం మార్గశీర్షోऽహమృతూనాం కుసుమాకరః|| 10-35 ||
అలాగే నేను సామాలలో బృహత్సామాన్ని, చందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని.
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् |
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम्
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్|
జయోऽస్మి వ్యవసాయోऽస్మి సత్త్వం సత్త్వవతామహమ్|| 10-36 ||
నేను మోసాలలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, జయాన్ని ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని.
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः |
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः
వృష్ణీనాం వాసుదేవోऽస్మి పాణ్డవానాం ధనఞ్జయః|
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః|| 10-37 ||
నేను వృష్టి వంశస్తులలో వాసుదేవుడిని, పాండవులలో, అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని.
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् |
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम्
దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్|
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్|| 10-38 ||
శాసకులలో దండమూ, జయంకోరేవాళ్ళల్లోని నీతీ, రహస్యాలలో మౌనమూ, జ్ఞానులలో జ్ఞానమూ నేనే.
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन |
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम्
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున|
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్|| 10-39 ||
అర్జునా! అన్ని ప్రాణుల యొక్క మూలకారణం నేను. చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు.
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप |
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया
నాన్తోऽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప|
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా|| 10-40 ||
అర్జునా! నా దివ్యమైన విభూతులకు అంతులేదు. నా విభూతుల విస్తారాన్ని క్లుప్తంగానే చెప్పాను.
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा |
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसम्भवम्
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంऽశసమ్భవమ్|| 10-41 ||
విశిష్టమైన గుణమూ, శోభా, శక్తీ కలిగినది ఏది ఉన్నదో ఆ ప్రతిదీ నా తేజము నుండి పుట్టినదని తెలుసుకో.
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन |
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत्
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున|
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్|| 10-42 ||
అర్జునా ఇన్ని మాటలు దేనికి ఈ యావత్ప్రపంచాన్ని నేను ఒక్క అంశతో భరించి నిలిచి ఉన్నాను.